calender_icon.png 30 January, 2026 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీజీ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ

30-01-2026 12:46:35 PM

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ వర్ధంతి వేడుకలు

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): జాతి పీత మహాత్మా గాంధీజీ ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని వాసవి క్లబ్ అధ్యక్షుడు మర్యాల ఉదయ్ బాబు పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి పురస్కరించుకొని శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ లో వాసవి ఇంటర్నేషనల్ సభ్యులు ఎక్కిరాల శ్రీనివాస్, టీవీ నంది పురస్కార గ్రహీత నాగబాల సురేష్ తో కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒకరు గాంధీజిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు, హింస మార్గాన్ని విడనాడి అహింసా మార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలని కోరారు. ఆయన సిద్ధాంతాలను, ప్రజలకు చేసిన సేవలు మరొకసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్రీధర్, మాజీ అధ్యక్షులు కోడిప్యాక వేణుగోపాల్, సాయిని సంతోష్, సభ్యులు కాచం ప్రకాష్, టి.గిరీష్, జి.వినేష్, జి.ప్రమోద్, కాచం వినేష్, జి.వేణుగోపాల్, ఆర్ మురళి, గోగుల శ్రీనివాస్, విశ్వేషర్, బి. మురళి, రాజు, వెంకన్న పాల్గొన్నారు.