calender_icon.png 30 January, 2026 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల బందోబస్తు పరిశీలన

30-01-2026 01:17:24 PM

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

మెదక్, (విజయక్రాంతి): తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని అవసరమైన భద్రతా చర్యలను చేపట్టిందని తెలిపారు. ఈ ఎన్నికలలో మొత్తం 92 మంది ఓటర్లు  (మెదక్, నర్సాపూర్, అల్లదుర్గ్) చెందిన వారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కోర్టు పరిసరాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయబడిందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.