calender_icon.png 30 January, 2026 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. వారి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్

30-01-2026 01:31:16 PM

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. వారి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణకు కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ హాజరయ్యానని కౌశిక్ రెడ్డి మీడియాతో అన్నారు.

దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరామన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగాలన్నారు.  నిన్నటి ఘటనపై స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. తన సొంతగ్రామంలో వీణవంకలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని చెప్పారు. తనపై ఓవరాక్షన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు న్యాయం జరిగే వరకు అధికారులను వదిలిపెట్టనని కౌశిక్ రెడ్డి తేల్చిచెప్పారు.