30-01-2026 12:52:05 PM
మండల పరిధిలోని రాంపురం తండ గ్రామానికి చెందిన గుగు లోతు నాగు నాయక్ అకాల మరణం చెందడంతో శుక్రవారం ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడడం చూసిన గ్రామ ఉపసర్పంచ్ ఆంగోతు శైలజ మోహన్ 5000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. అనంతరం నాగునాయక్ 2012 పదవ తరగతి క్లాస్మేట్స్ అందరూ కలిసి 14000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ శైలజ మోహన్ మాట్లాడుతూ నాగు నాయక్ మృతి చాలా బాధాకరమని అన్నారు. నాగు నాయక్ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆకుటుంబానికి ప్రగడ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూక్య వెంకటేష్, భూక్య నాగు, ఆంగోతు శోభన్,గుగులోతు వెంకన్న, ఆంగోతు నాగేశ్వరరావు, ఆంగోతు రంగా, ఆర్ఎంపీ డాక్టర్ మురళి, గ్రామస్తులు పాల్గొన్నారు.