30-01-2026 12:11:44 PM
సనత్‌నగర్ జనవరి 30 (విజయ క్రాంతి): 78వ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ కోట నీలిమ గారి (TPCC ఉపాధ్యక్షులు, సనత్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్) సూచనల మేరకు అమీర్‌పేట పరిధిలోని సంజీవ్ రెడ్డి నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి సికింద్రాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జి. శ్రీకాంత్ యాదవ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జి. శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ…దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గమే నేటికీ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. సమాజంలో పెరుగుతున్న హింస, అసహనం, విభేదాలకు గాంధీజీ సిద్ధాంతాలే పరిష్కారమని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా నేటి యువత గాంధీ ఆశయాలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, సమాజ సేవ, దేశభక్తి, నైతిక విలువలతో ముందుకు సాగితేనే బలమైన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు అమీర్‌పేట డివిజన్ అధ్యక్షులు ఎస్.ఎస్.రావు,ఎం. నవీన్ రాజ్, గోవింద్ రాజ్, నరేష్, సాయి గౌడ్,శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమం అంతటా గాంధీజీ జీవిత విశేషాలు, ఆయన త్యాగాలు గుర్తు చేస్తూ నినాదాలు చేశారు.