calender_icon.png 30 January, 2026 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ పేరిట రాజకీయ వేధింపులు

30-01-2026 12:08:32 PM

చింతమడకలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

సిద్దిపేట రూరల్ జనవరి 30: సిట్ పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిల్లర రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. చింతమడక గ్రామంలో సర్పంచ్ సుమలత–శంకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టేనని హెచ్చరించారు.

ప్రజల పాలన అంటూ సిట్ దర్యాప్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం మొత్తం అగ్గిగుండం అవుతుందన్నారు. ప్రతిపక్షాలను భయపెట్టేలా అక్రమ కేసులు పెట్టడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ దమనకాండను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వసూరి తిరుపతి, పీట్ల కనకయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు కాంతుల మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ రవి, వార్డు సభ్యులు పోచంపల్లి యాదగిరి, మల్లేశం,స్వామి,రాజేశ్వర్, జెల్ల, స్వామి, నయీం తదితరులు పాల్గొన్నారు.