30-01-2026 12:49:13 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అక్రమంగా ఫోన్ టాపింగ్ కేసు పెట్టడం నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాబిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేసే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నీటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరో హామీలు అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రాజకీయంగా పబ్బం కోసమే అక్రమ కేసులు బనాయిస్తురని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గోరా పరాభావం తప్పదని హెచ్చరించారు. కెసిఆర్ పై అక్రమ కేసులు పెడితే మరో ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు గుండ గాని రాములు గౌడ్, సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, దొంగరి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాల్యాల రాములు ,మల్లయ్య, దాసు, నరేష్ నాయక్ గోపగాని రమేష్ గౌడ్, తునికి లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.