calender_icon.png 1 February, 2026 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహారావుకి చేయూత ట్రస్ట్ సాయం

01-02-2026 05:38:38 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన పుట్టి నరసింహారావుకు ఆదివారం బంజర్ గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ వారు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పుట్టి నరసింహారావు జీవనోపాధి కోసం తాపీ పని నిమిత్తం హైదరాబాదులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం రోజుల క్రితం అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి.

కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ కింద అడ్మిషన్ చేయించి వైద్యం అందిస్తున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో చేయూత ట్రస్టు దృష్టికి తీసుకురాగా వారు స్పందించి ఆదివారం మూడువేల రూపాయలను భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కే.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి జక్కిరెడ్డి మల్లారెడ్డి, కోశాధికారి పుట్టి రాజేష్, ట్రస్ట్  సభ్యులు సెనగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.