calender_icon.png 2 February, 2026 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్న బీఆర్‌ఎస్ శ్రేణులు

02-02-2026 12:00:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 01 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కుట్రా పురితంగా సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణు లు నిరసన వ్యక్తం చేశారు. మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఆధ్వర్యంలో బోరజ్ జాతీయ రహదారిపై చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను ఎండగట్టారు.

జిల్లాలోని ఉట్నూర్, జైనథ్, బేల, బోథ్, తలమడుగు తదితర మండలాల్లో పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో, కాంగ్రెస్ దిష్టి బొమ్మ దహనం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. బోరజ్  సమీపంలోని జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుని మాజీ మంత్రి రామన్న ను అరెస్టు చేసే స్టేషన్ కు తరలిస్తుండగా పార్టీ నాయకులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.