02-02-2026 12:00:00 AM
మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టి ట్యూట్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
హైదరాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): క్యాన్సర్ భయం వద్దు.. అవగాహన ఉంటే విజయం మనదే అనే నినాదంతో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం మహిళల కోసం ప్రత్యేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 100 మంది మహిళా రైడర్లు హైటెక్ సిటీ వీధుల్లో ఉత్సాహంగా చేరి, క్యాన్సర్ నివారణ, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను ప్రజల్లో అవగా హన చేయించారు.
ఈ ర్యాలీని మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ టి.సాయి మనో హర్, మిస్ మితాలీ అగర్వాల్ (మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్) కలసి ప్రారంభించారు, కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నుంచి డాక్టర్ వేణుగోపాల్ (మెడికల్ ఆంకాలజిస్ట్), డాక్టర్ రవి చంద్ర (రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్), డాక్టర్ సరిత, డాక్టర్ కవిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాదాపూర్ డీసీపీ సాయి మనోహర్ మాట్లాడుతూ రోడ్డు మీద హెల్మెట్ ధరించడం మన ప్రాణాల రక్షణే, అలాగే మహిళలు క్రమం తప్పకుండా క్యా న్సర్ పరీక్షలు చేయించుకోవడం వారి జీవితాలకు రక్షణ.
భయం వద్దు, సరైన అవగాహనతో క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిం చవచ్చు అని అన్నారు. మిస్ మితాలీ అగర్వాల్ మాట్లాడుతూ మహిళలు అందరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కానీ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ 100 మంది బైకర్లు ప్రతి మహిళను తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని ప్రేరేపిస్తున్నారన్నారు. మ నం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. డాక్టర్ రవి చంద్ర (రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్) మాట్లాడుతూ రోబోటిక్ సర్జరీ ద్వారా, కనీస నొప్పితో, త్వరగా కోలుకొని జీవితాన్ని రికవర్ చేసుకోవచ్చు.
ముందస్తు పరీక్షల వల్ల 70% మందిని మేము సులభంగా కాపాడగలుగుతున్నాం. డాక్టర్ వేణుగోపాల్ (మెడి కల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్) మాట్లాడుతూ ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తించడం అత్యంత కీలకం. ప్రతి మహిళ, ప్రతి వ్యక్తి తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సమయానికి వైద్య పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్ విజయం సాధించవచ్చు అన్నారు. డాక్టర్ ప్రశాంత్ రెడ్డి (రేడి యేషన్ ఆంకాలజిస్ట్) మాట్లాడుతూ ‘క్యాన్సర్ ట్యూమర్లను మాత్రమే లక్ష్యంగా చేసు కుని అత్యాధునిక యంత్రాలతో చికిత్స అం దుబాటులో ఉంది.
భయపడకండి, సమయానికి వైద్యులను సంప్రదిస్తే క్యాన్సర్‌ను జయించడం కష్టమేమీ కాదు అని అన్నారు. 100 మంది మహిళా రైడర్లు ర్యాలీ ద్వారా సామా న్య ప్రజల్లో క్యాన్సర్ నివారణ, ముందస్తు పరీక్షల అవగాహనను విస్తరించారు. కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన పొం దింది. మహిళల ఆరోగ్య చైతన్యానికి ప్రేరణగా నిలిచింది.