బీజేపీ కార్యకర్తపై బీఆర్‌ఎస్ శ్రేణుల దాడి
15-05-2024 02:23 AM
కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు
మల్లేశ్‌ను పరామర్శించిన బండి సంజయ్
కరీంనగర్, మే 14 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని చింతకుంటలో బీఆర్‌ఎస్ శ్రేణుల దాడిలో బీజేపీ కార్యకర్త మల్లేశ్ గాయపడ్డాడు. కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశ్‌ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడి ఆరా తీశారు. దాడి ఎలా జరిగిందని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీకి ఫోన్ చేసి దాడి చేసిన జడ్పీటీసీ భూమయ్య సహా దుండుగులను తక్షణమే అరెస్టు చేయలని కోరారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.




