1 April, 2026 | 11:36 PM

బెల్లంపల్లి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి

01-04-2026 09:47 PM

- ఎఫ్ఏసీ డా. శ్రీదేవీ కి చైర్ పర్సన్ వినతి

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరు చేయాలని బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేశ్ కోరారు. బుధవారం హైదరాబాద్ లో పురపాలక పరిపాలన శాఖ ప్రభుత్వ కార్యదర్శి పురపాలక పరిపాలన కమిషనర్ & డైరెక్టర్ (ఎఫ్‌ఏసి)  డాక్టర్ టి.కె.శ్రీదేవి ని కలిశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి తో కలిసి ఎఫ్ ఏ సీ డా. శ్రీదేవి కి వినతి పత్రం అందచేశారు. డంపింగ్ యార్డు అభివృద్ధి కోసం (కంపౌండ్ వాల్, DRCC షెడ్, అంతర్గత రహదారి, విద్యుత్ దీపాలు మొదలైన వాటితో సహా పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

- విన్నవించినా అభివృద్ధి పనులు

వైకుంఠ ధామం, బెల్లంపల్లి పట్టణంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ కోసం 11 నూతన 'స్వచ్ఛ ఆటోల' కొనుగోలు, మున్సిపాలిటీ లోని వివిధ వార్డులలో సీసీ రోడ్లు మురుగు కాలువల నిర్మాణం, కోసం నిధులు విడుదల ను కోరారు. అదేవిధంగా పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ఇద్దరు శానిటేషన్ ఇన్స్ పెక్టర్లు, సరిపడా శానిటేషన్ సిబ్బందిని నియమించాలని, పట్టణంలోని పలు ప్రాంతాలలో పెద్ద డ్రైన్ లు, వాటి విస్తరణ పనుల నిర్మాణం అభివృద్ధి పనులకు నిధులు కావాలని తెలిపారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులు కోసం త్వరితగతిన సరిపడా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ శాఖ కమిషన్ డైరెక్టర్ శ్రీదేవీ అభివృద్ధి పనులకు నిధులు సమాకూర్చేందుకు కృషి చేస్తానని సానుకూలంగా స్పందించినట్టు మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేశ్ తెలిపారు.