calender_icon.png 2 May, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి

24-04-2025 12:42:50 AM

బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ

ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : వరంగల్ లో ఈ నెల 27వ తేదీన నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు,  కార్యకర్తలు తరలిరావాలని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ కోరారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ నుంచి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వరంగల్‌లో జరిగే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి బీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా ముఠా జైసింహ  మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో వాల్ రైటింగ్, ప్లెక్సీబోర్డులు, గులాబి తోరణాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయ కులు డి.శివ ముదిరాజ్, నాయకులు బల్వంత్, శ్రీకాంత్ యాదవ్, బాబు, సాయి చాణిక్య రెడ్డి, అనిల్ తదితరులు తరలివెళ్లారు.