calender_icon.png 3 May, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర దాడి అత్యంత దారుణం

24-04-2025 12:49:05 AM

డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

ఖమ్మం, ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ):-పహాల్గంలో బైసరన్ లో జరిగిన ఉగ్రదాడి దారుణమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దాడిలో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇది బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనం అని ఇలాంటి దాడులు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలి రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఆలోచన తప్పితే దేశ ప్రజలు వారి అవసరాలు ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టవు..ఇలాంటి దాడలు వల్ల అమాయక ప్రజలు మరణించడం చాలా దురదృష్టకరం అన్నారు.ఈ తప్పిదానికి పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వం మోడీ, షా లాదేనని అన్నారు.మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు...