18-09-2025 01:06:51 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ సెప్టెంబర్ 17(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్నిసోనియా గాంధీ ఇచ్చిన తర్వాత హార్దిక మంత్రి మన్మోహన్ సింగ్ బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పజెప్పితే పదేళ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారి అధోగతి పాలన చేశారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండాను ఆయన ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్17ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలపుమేరకు విలీన దినంగా జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం విజన్ లేని ప్రాజెక్టులు కట్టి, పరిపాలన చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు .
గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 19 గంటలు పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, వంటేపాక ఏసు పాదం, పన్నాల రాఘవరెడ్డి లింగాల వెంకన్న గాదగోని కొండయ్య స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.