18-09-2025 01:08:09 AM
జిన్నారం(అమీన్పూర్) సెప్టెంబర్ 17 :గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం స్టూడెంట్ జేఏసీ అధ్యక్షులు ఎస్ విజయ్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సా మాన్యులే సాయుధులై తిరగబడ్డ రోజు,
నిజం పాలనకు చరమగీతం పాడిన రోజు, రాక్షస మూకలను అణిచివేసిన రోజు, తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజు అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, గడ్డమీది గణేష్, అంబదాస్, తోట్ల రామకృష్ణ, మియాపురం సుదర్శన్, ఠాగూర్ రమణ సింగ్, సిహెచ్ గణేష్, బ్యాగరి శేఖర్, అరె గూడెం భాస్కర్, గడ్డమీది అనిల్ కుమార్, మియాపురం చిన్నపాల్గొన్నారు.