calender_icon.png 1 December, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాంబండ బీఆర్‌ఎస్‌ గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.!

01-12-2025 10:13:41 PM

స్థానిక ఎన్నికల వేళ భారీగా పార్టీలు మారుతున్న కార్యకర్తలు..

శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండల పరిధిలోని పాంబండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ యువకులు కాంగ్రెస్ పార్టీలోకి సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో తాటికొండ నవీన్ గౌడ్, అతని మిత్రులు సుంక మహేష్, గుమ్ముల భాస్కర్, కుమ్మరి రమేష్, నిజ్జనభూపాల్, గుమ్ముల దశరథ్, లింగరాజు, తూప్రాన్ అనిల్, కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం కోసం కలసికట్టుగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పాంబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్క మల్ల మైసయ్య యాదవ్, మన్నె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.