calender_icon.png 1 December, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య

01-12-2025 10:15:43 PM

ములకలపల్లి (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలు 2025 నామినేషన్ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య ములకలపల్లి మండలంలోని సీతారాంపురం, పూసుగూడెం, ములకలపల్లి, జగన్నాధపురం, మాదారం, కమలాపురం, ముకమావిడి, సీతాయిగూడెం గ్రామాలు, అలాగే అన్నపురెడ్డిపల్లి మండలంలోని నరసాపురం, అన్నపురెడ్డిపల్లి, పెద్దిరెడ్డిగూడెం, పెంట్లం, గుంపిన, మర్రిగూడెం, ఊటపల్లి, తొట్టిపంపు, భీమినగూడెం గ్రామ పంచాయతీలను సందర్శించారు. ప్రతీ నామినేషన్ కేంద్రంలో జరుగుతున్న ప్రక్రియ, ప్రజల రద్దీ, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆమె, అధికారులు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఎంపీవోలు పాల్గొన్నారు.