calender_icon.png 9 October, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ రావును కలిసిన బీఆర్ఎస్ విప్ లు సత్యవతి, కేపీ వివేకానంద

06-02-2025 06:51:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శాసనమండలి, శాసనసభలో  బీఆర్ఎస్ పార్టీ విప్ లుగా నియమితులైన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Satyavathi Rathod), ఎమ్మెల్యే  కేపీ వివేకానంద గౌడ్(MLA KP Vivekananda Gowd)  గురువారం కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీశ్ రావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించాలని హరీష్ రావు సూచించారు.

రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే  కేపీ వివేకానంద గౌడ్ లను శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ లుగా నియమించారు. అధినేత నిర్ణయాన్ని కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు కలిసి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్సీ సత్యవతి, ఎమ్మెల్యే  కేపీ వివేకానంద ఉత్తర్వులను అందజేశారు. తమకు విప్‌లుగా అవకాశమిచ్చిన సందర్భంగా నిన్న కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.