15 April, 2026 | 8:16 AM

అల్గోల్‌లో 12.9 డిగ్రీలు

15-02-2026 01:02 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంకా నమోదవుతునే ఉన్నా యి. ఫిబ్రవరి రెండోవారం గడిచినా ఇంకా చలి తీవ్రత పూర్తిగా తగ్గలేదు. శనివారం సంగారెడ్డి జిల్లా అల్గోల్‌లో 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో 13 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.