calender_icon.png 22 January, 2026 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా యాప్ ను తొలగించాలని బీఆర్ఎస్ రాస్తారోకో

22-01-2026 01:22:37 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించే పంటకు అన్నదాతలు అవస్థల పాలవుతున్నారని బారాస ఆవేదన వ్యక్తం చేశారు రైతుల యూరియా వితరణ పై విధించిన నిబంధనలు సడలించాలని కోరుతూ గురువారం మండల కేంద్రం లోని బస్టాప్ లో వాహనాలను నిలిపివేశారు. ధర్నా చేపట్టి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ యాప్ విధానంతో  నిరక్ష రాసులు అయిన రైతులకు అవగాహన లేక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. యూరియా అందుబాటులో ఉన్న క్షణాల్లో అయిపోతుందని దీంతో ఇబ్బందులు తప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి మర్రిగూడ ఎస్.ఐ మునగాల కృష్ణారెడ్డి తో బాటు, సంఘటన స్థలానికి చేరుకున్న మునుగోడు వ్యవసాయ సహయ సంచాలకులు వేణుగోపాల్  సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి కెల్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం తో నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండలం టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.