22-01-2026 12:51:00 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ పార్వతి సమేత బాలేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ( రథోత్సవ)సహిత కాంతియాగ నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని పెద్దవాగు సమీపంలో గల బాలేశ్వర స్వామి ఆలయంలో వేత పండితులు రవిచంద్ర చందావార్, ఈదులవాడ శ్రావణ్, బాలేశ్వర్ల ఆధ్వర్యంలో రుద్ర సహిత గురు దక్షిణమూర్తి హోమం, పార్వతీ సమేత బాలేశ్వరస్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజోపచారములు, మంగళహారతి, మహామంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.