calender_icon.png 22 January, 2026 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చేస్తున్న దీక్షకు మద్దతు కరువు

22-01-2026 03:57:55 AM

  1. బీఆర్‌ఎస్ మీడియాఅధికార ప్రతినిధి క్రిశాంక్  
  2. ప్రజలను మభ్యపెడుతున్న స్థానిక ఎమ్మెల్యే
  3. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తన వైఖరి ఏంటో తెలియజేయాలి

సికింద్రాబాద్ జనవరి 21 (విజయ క్రాంతి): కంటోన్మెంట్ ఎమ్మెల్యే తన దీక్షను ఇదేవిధంగా కొనసాగించాలని అప్పటివరకు జిహెచ్‌ఎంసి ఎన్నికలు నిర్వహించవద్దని మన్నే క్రిశాంక్   డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు పదవి కాలాన్ని పొడిగిస్తూ విడుదలైన గెజిట్ పత్రాలను కంటోన్మెంట్ కార్యాలయం వద్ద కుర్చీని కాల్చేసి ఇటీవల చేసిన నిరసన విషయంలో పోలీసులు తనపై కేసు నమోదు చేయడాన్ని బిఆర్‌ఎస్ సోషల్ మీడియా అధికార ప్రతినిధి మన్నె కృషాంక్ తీవ్రంగా వ్యతిరేకించారు. కంటోన్మెంట్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్న ఆవేదనతో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ చేసిన శాంతియుత నిరసనను హింసాత్మక ఆందోళనగా  పరిగణించి తనపై కేసు నమోదు చేయించారని మన్నె కృషాంక్  తెలియజేశారు.

కంటోన్మెంట్ బోర్డ్ అధికారులు ఫిర్యాదుకు సంబంధించిన స్క్రిప్టును భాజపా, కాంగ్రెస్ పార్టీ నేతలు రాయించి ఇచ్చినట్టు ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 29 కేసులు నమోదు అయ్యాయని, బోర్డు విలీనంపై ఎంపీ ఈటల స్పందించాలి..బిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృషాంక్ కంటోన్మెంట్ విషయంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ తమ వైఖరిని వెల్లడించకుండా ప్రజలను మభ్య పెడు తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కంటోన్మెంట్ ఎమ్మెల్యే తన దీక్షను ఇదేవిధంగా కొనసాగించాలని అప్పటి వరకు జిహెచ్‌ఎంసి ఎన్నికలు నిర్వహించ వద్దని కృషాంక్ డిమాండ్  చేశారు..