22-01-2026 12:49:48 PM
చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్ అతర్ సింగ్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్
బెజ్జూర్ మాజీ సర్పంచ్ అన్సార్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఎస్పీలో చేరిక
బెజ్జూర్,(విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బెజ్జూర్ మాజీ సర్పంచ్ అన్సార్ హుస్సేన్,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ హకీమ్,పార్టీలో చేరడం సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పార్టీ చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ లు అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో నీలి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాగజ్‌నగర్ మున్సిపాలిటీపై బీఎస్పీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.