calender_icon.png 22 January, 2026 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భట్టి కోసం నిరీక్షణ

22-01-2026 12:55:54 PM

మూడు గంటలుగా సభ వద్ద ఎదురుచూస్తున్న ప్రజలు 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జైనూర్ మండలం పర్యటనలో భాగంగా జామ్ గాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దాదాపుగా రెండు గంటలు అలసంగా వచ్చారు. మంత్రి పర్యటన నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు గిరిజనులు  ఉదయం 9 గంటలనుండి సభ స్థలానికి చేరుకున్నారు.మంత్రి 10:30 గంటలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 12:30 గంటల వరకు రాకపోవడంతో కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది.అధికారులు సైతం మంత్రి రాక కోసం ఎదురుచూపులు తప్పలేదు.