14 August, 2026 | 7:27 AM

బీఆర్ఎస్ పదేళ్లుగా యువత భవిష్యత్తుతో ఆటులు ఆడింది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

18-06-2024 01:06 PM

హైదరాబాద్ : నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్షపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ కూడా  ఇస్తున్నాం అని చెప్పారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసామన్నాం.. చేస్తున్నాం అన్నారు.

గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన చర్చను బీఆర్ఎస్ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 3కు దొరికే విద్యుత్ ను వద్దని చెప్పి రూ.6కు ఎవరైనా కుంటారా? అని మండిపడ్డారు. గత ప్రభుత్వం సౌర, పవన విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వలేదని, రూ.11 వేల కోట్లతో ఝార్ఖండ్ 2,400 మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.

స్థానికంగానే విద్యుదుత్పత్తి చేసుకుంటే రాష్ట్రానికి భారం తప్పి సౌర విద్యుత్ సగం ధరకే వస్తుందని ఆయన వెల్లడించారు.యాదాద్రి ప్రాజెక్టు.. రాష్ట్రానికి గుదిబండ అవుతుందని ఆనాడే తము హచ్చరించామన్నారు. ఎవరైనా రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలో ప్రాజెక్టులు పెడతార అని బొగ్గు గనులకు దూరంగా ఉన్న దామరచెర్లలో ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. హరీశ్ రావు ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించాలన్నారు. అన్నీ తెలిసే పక్కదారి పట్టించేలా హరీశ్ రావు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా యువత భవిష్యత్తుతో ఆటులు ఆడిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.