3 August, 2026 | 4:14 PM

ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలి

03-08-2026 03:41 PM

- బిఆర్ఎస్ వి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా

- విద్యార్థుల హామీల అమలులో ప్రభుత్వం విఫలం

- బిఆర్ఎస్వి విద్యార్థి నాయకుడు గుండెల్లి కళ్యాణ్ కుమార్ 

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై కేజీ టు పీజీ ప్రాంగణం ముందు  విద్యార్థుల సమస్యలపై సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్వి విద్యార్థి విభాగ నాయకుడు గుండెల్లి కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో మూడు సంవత్సరాలు గడిచినా రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల చేయకపోవడం దురదృష్టకరమన్నారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం యువతను నిరాశకు గురి చేస్తోందన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్, అజ్మత్, అర్జున్, దేవేందర్, శంకర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.