12 June, 2026 | 2:21 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఘనంగా బిటి రణదీవే వర్ధంతి

06-04-2026 08:27 PM

దమ్మపేట,(విజయక్రాంతి): బిటి రణదీవే వర్ధంతి సభ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో  సోమవారం సీఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు ఆధ్వర్యంలో ఘనంగా  జరిగింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ... సిఐటియు అఖిలభారత వ్యవస్థాపక అధ్యక్షులు, కార్మిక వర్గ ముద్దుబిడ్డ కామ్రేడ్ బిటి రణదీవే  కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక విజయాలు సాధించి పెట్టారని, 

బీటీ రణధీవే కార్మిక సంఘాలను ఐక్యం చేసి దేశంలో అనేక సంఘాలు స్థాపించారని, వాటికి నాయకత్వం వహించి ఆందోళన పోరాటాలు నిర్వహించారని, స్వాతంత్రం రాకముందు మొట్టమొదటి రైల్వే కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహించారని, జూట్ మిల్లు  కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారని, ఆయన జీవితం నేటి కార్మిక వర్గానికి ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సి ఐ టి యు నాయుకులు రామకృష్ణ, రాఘవయ్య నరసింహారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.