12 June, 2026 | 1:19 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

చిట్యాల నూతన తహసీల్దార్‌గా ఎం.విజయ్ కుమార్

06-04-2026 08:24 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల నూతన  తహసిల్దార్ గా ఎం. విజయ్ కుమార్ సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వ బదిలీపై చిట్యాల మండలానికి తహసిల్దార్ గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన నూతన తహసీల్దార్‌కు చిట్యాల డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, సిబ్బంది సమన్వయంతో మండల అభివృద్ధికి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని నూతన తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.