5 May, 2026 | 2:02 AM

వరంగల్ నగర అభివృద్ధికి బిల్డర్స్ అసోసియేషన్ కృషి

05-05-2026 12:00 AM

హనుమకొండ అర్బన్, మే 4 (విజయక్రాంతి): వరంగల్ మహా నగర అభివృద్ధిలో ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కృషి ఎంతో ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ మడికొండ సత్యసాయి కన్వెన్షన్ హాల్ నందు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన సత్యమూర్తి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం, సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన సత్యమూర్తి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

నాణ్యమైన నిర్మాణాలు, పారదర్శక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు అందించవచ్చని పేర్కొన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు నిర్మాణ రంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీ ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ జంగా రాఘవ రెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, కాంగ్రెస్ నాయకులు పిన్నింటి అనిల్ రావు, హన్మకొండ జెబిఎం చైర్మన్ జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.