డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం
ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్
ములుగు (మహబూబాబాద్) మే 11 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలోని యువత మత్తు మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించడం కోసం, అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా వారిని చైతన్యవంతులను చేయాలనే సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అన్ని మండల కేంద్రాల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలని సంకల్పించారు.
ఈ సందర్భంగా ములుగులో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తాను ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మొదట్లోనే ఇట్టి కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నానని, మేడారం మహా జాతర సందర్భంగా నిర్వహించలేకపోయినట్లు తెలిపారు. జాతర తర్వాత నక్సల్ రహిత సమాజాన్ని సాధించే దిశగా డెడ్లైన్ విధించగా, అందుకు అనుగుణంగా దేశంలోనే తెలంగాణలో అత్యుత్తమ సరెండర్ పాలసీ అమలు చేస్తూ ములుగు జిల్లాలో పెద్ద ఎత్తున మావోయిస్టులను సరెండర్ చేయించి తద్వారా ములుగు జిల్లాను నక్సల్ రహిత జిల్లాగా మార్చినట్టు తెలియజేశారు.
ఆ తర్వాత ములుగు జిల్లా యువత కోసం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర సీఎం చేతుల మీదుగా మీదుగా ‘గిరి దర్శక్’ అనే కార్యక్రమం ప్రారంభిస్తూ ములుగు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. తదనంతరం ములుగు జిల్లా యువత కోసం స్పోరట్స్ మీట్ కండక్ట్ చేయాలని, జాబ్ మేళాను నిర్వహించాలని, నిరుద్యోగ యువత కోసం ట్రైనింగ్ ప్రోగ్రాములు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు.
అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా యువతకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ మొదటగా మండల స్థాయిలో, ఆ తర్వాత సబ్ డివిజన్ స్థాయిలో, చివరిగా జిల్లా స్థాయిలో ఫైనల్స్ జాకారంలో నిర్వహిస్తామని తెలియజేశారు. డి సి ఆర్ బి డి ఎస్ పి కిషోర్ కుమార్, ములుగు డిఎస్పి రవీందర్, ములుగు సిఐ సురేష్, ఆర్ ఐ లు, ఎస్త్స్ర లు, ఆర్‌ఎస్‌ఐలు, ప్రజా ప్రతినిధులు, యువత పాల్గొన్నారు.






