నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం
- వర్షాలతో శిథిలావస్థకు చేరుతున్న చుట్టుపక్కల ఇళ్లు..
- అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల తీవ్ర ఆగ్రహం
- నిద్రమత్తులో జీహెచ్‌ఎంసీ
ఆదిభట్ల, ఆగస్టు 19 (విజయక్రాంతి): అధికారుల అండదండలు ఉన్నాయనో, లేదా వారి ఉదాసీనతో తెలియదు కానీ.. ఆదిభట్ల సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు మూ డంతస్తులు ఆరు పువ్వులుగా విరాజిల్లుతున్నాయి. స్థానికుల భయాందోళనలు, వర్షా ల గండం వెంటాడుతున్నా పట్టించుకునే నా థుడే కరువయ్యాడు.
రాఘవేంద్ర కాలనీలో భయం భయం..
ఆదిభట్ల సర్కిల్ రాఘవేంద్ర కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఓ బ హుళ అంతస్తుల భవన నిర్మాణం స్థానికుల కు నిద్రలేకుండా చేస్తోంది. భారీ సెల్లార్ కో సం చేసిన అక్రమ తవ్వకాల వల్ల చుట్టుపక్క ల ఉన్న ఇళ్ల పునాదులు బలహీనపడే ప్రమా దం ఏర్పడింది.
గతంలోనే సెల్లార్ అక్రమ త వ్వకాలపై వార్తా కథనాలు వెలువడినప్పటి కీ, బాధ్యత వహించాల్సిన జీహెచ్‌ఎంసీ టౌ న్ ప్లానింగ్ అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిర్మాణదారులు యథేచ్ఛగా పనులు కానిచ్చేస్తున్నారు.
వేగంగా పనులు..
ఇప్పటికే ప్రమాదకర రీతిలో సెల్లార్ త వ్వకం పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు ఉన్నాయా? సెల్లార్ కోసం అప్రూవల్ ప్లాన్ పొందారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పెరుగుతున్న ప్రమాద హెచ్చరికలు..
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సెల్లార్ తవ్విన గోతుల్లోకి నీరు చేరి, పక్కనే ఉన్న ఇళ్ల గోడలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే పక్కనే ఉన్న సిమెంట్ రోడ్లు కూడా కుంగిపోయే ప్రమాదం పొంచి ఉందని కాలనీవాసులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మామూళ్ల మత్తులో యంత్రాంగం?
టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించకపోవడం వెనుక పెద్ద ఎ త్తున ’మామూళ్లు’ చేతులు మారాయనే ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. నోటీసులు ఇవ్వడానికే పరిమితమవుతున్న అధికారులు, క్షేత్రస్థాయిలో పనులను నిలిపివేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
స్థానికుల డిమాండ్..
సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని, అనుమతుల వాస్తవాలను బయటపెట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్ర మాదాలు జరగకముందే అక్రమ నిర్మాణాన్ని ఆపి నిలిపివేసి, బాధ్యులైన అధికారు లు, నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.






