విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
మంథని, మే 29 (విజయక్రాంతి): మంథని మండలంలోని లక్కపూర్ గ్రామానికి చెందిన పండగ వెంకటస్వామికి చెందిన పాడి ఎద్దు శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాధితుడి కథనం ప్రకారంరైతు వెంకటస్వామి తన వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దును తోలుకెళ్లగా, సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదం జరిగింది.
ట్రాన్స్ఫార్మర్ లేదా దానికి సంబంధించిన వైర్లు లీకేజ్ కావడంతో, దానికి తాకిన ఎద్దు తీవ్రమైన విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు విడిచింది. చేతికొచ్చిన పాడి పశువు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో రైతు వెంకటస్వామి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎద్దును పట్టుకుని ఆయన కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను తీవ్రంగా చలింపజేసింది.
తనకు జీవనాధారమైన ఎద్దు మరణించడంతో రూ. 60.000 భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






