చిత్తశుద్ధితో మా సమస్యల పరిష్కారం
30-05-2026 12:03 AM
ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ బకాయిలు విడుదలపై హర్షం
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కీలక అడుగు వేసిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొంది. ఉద్యోగులకు బకాయిగా ఉన్న రూ.6వేల కోట్ల చెల్లింపులో భాగంగా తొలి విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్ర కారం వంద రోజుల వ్యవధిలో బకాయిల చె ల్లింపులకు శ్రీకారం చుట్టడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని జేఏసీ చై ర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు.






