30 May, 2026 | 2:48 AM

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

30-05-2026 12:02 AM
  1. బిచ్కుంద, మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో సమీక్ష
  2. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

బిచ్కుంద, మే 29 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం బిచ్కుంద, మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలను తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులు సిబ్బందితో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహకారం ఐకెఎఫ్ నిధుల ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చి ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆస్పత్రులలో ప్రస్తుతం ఉన్న సమస్య లైనా కాంపౌండ్ వాల్ నిర్మాణం మంచాల కొరత స్ట్రక్చర్ బాత్రూం సౌకర్యాల మెరుగుదల ఠాగూర్ సదుపాయం నర్సింగ్ స్టాప్ కొరతవంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నమని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే పేదల వలయులకు నాణ్యమైన వైద్యం అందాల వైద్యులు సిబ్బంది బాధ్యత యుతంగా పనిచేయాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్ర త సమయపాలన అత్యవసర సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. డిసిహెచ్, ఆసుపత్రి వైద్యు లు, హెచ్ డి ఎస్ కమిటీ సభ్యులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.