రిటైర్డ్ ఎస్సై ఇంట్లో చోరీ..
బీరువా పగలకొట్టి నగదును ఎత్తుకెళ్లిన దుండగులు
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ రిటైర్డ్ ఎస్సై ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంట్లో బీరువాను పగలకొట్టి చోరికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. జుక్కల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లాడెగావ్ గ్రామంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఎస్సై తుకారం ఇంటికి తాళం వేసి గత సోమవారం బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో శుభకార్యానికి వెళ్లారు. దోంగలు రాత్రి పూట పైకప్పు నుండి ఇంట్లోకి దిగి బీరువాను పగలకొట్టి వస్తువులను చిందరవందర చేశారు. దేవుని హూండిలో ఉన్నటువంటి రూ.3వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తుకారాం ఆదివారం సాయంత్రం వచ్చి జుక్కల్ పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుని పిర్యాదు మేరకు జుక్కల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచానామా నిర్వహించినట్లు ఎస్సై భువనేశ్వర్‌రావు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.






