15-09-2025 12:34:24 AM
గంభీరావుపేట, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం తో కరెంట్ లేక పంటలు ఎండిపోతు న్నాయని నాగంపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వా రం రోజుల క్రి తం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన ఇప్పటివరకు మరమత్తులు చేయక పోవడంతో విద్యుత్ లేక పం టపొలాలు పగుళ్లు ఏర్పడి నోటికి అందిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
విద్యుత్ శాఖ అధికా రులు పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు శీను, రాజయ్య, గణేష్ తదితరులు మాట్లాడుతూ వారంరోజులుగా సమస్యను చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధి కారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్లు మ రమ్మతు చేయకపోతే పంటలు నష్టపోతామనీ వాపోయారు. ఇప్పటికైనా సెస్ అధికారుల స్పందించి ట్రాన్స్ఫార్మర్ మరమత్తు చేయించాలనికోరారు.