15-09-2025 12:33:20 AM
జనగామ, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఆదివారం హైదరాబాద్ బోడుప్పల్ జరిగిన 29 వ జాతీయ స్థాయి కరాటే పోటీలలో జనగామకు చెందిన విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి పలు పథకాలు కైవసం చేసుకున్నారని విక్టరీ చోటోఖాన్ కరాటే అకాడమీ జిల్లా అధ్యక్షులు, మాస్టర్ ఓరుగంటి సంతోష్ కుమార్ తెలిపారు.
పథకాలు సాధించిన వారిలో అండర్ 14 సంవత్సరాల బాలికల విభాగంలో మాట్ల జెస్సిక, అండర్ 8 సంవత్సరాల బాలికల విభాగంలో చెల్లోజు అక్షయ, అండర్ 8 సంవత్సరాల బాలుర విభాగంలో బండ శ్రీరామ్, మహేశ్వరం అశ్విత్ చంద్ బంగారు పథకాలు గెలుపొందగా, అండర్ 14 సంవత్సరాల బాలుర బ్రౌన్ బెల్ట్ విభాగంలో ఓరుగంటి అక్షిత్ మణివర్ధన్, 12 సంవత్సరాల బాలుర విభాగంలో ఓరుగంటి నిక్షిత్ మణివర్ధన్, మట్ల సామ్యేల్ జాన్, సిల్వర్ మెడల్స్ గెలుపొందగా, బాలికల కలర్ బెలట్స్ విభాగంలో హృతిక, ఆంధ్రగుండా వర్షిని, బండ అవంతిక లు కాంస్య పథకాలు గెలుపొందారు. పథకాలు సాధించిన విద్యార్థులను విక్టరీ ఫోటో కం కరాటే అకాడమీ ఇండియా చీప్ రంగు మల్లికార్జున్ గౌడ్, సీనియర్ మాస్టర్లు సదాశివుడు, బాబురావు, సురేష్, గిద్దలూరు శ్రీనివాస్, తదితరులు అభినందించారు.