15-09-2025 12:34:36 AM
ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరెంటి విజయ్ మాదిగ
జనగామ, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : జనగామ చౌరస్తా లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగల కృతజ్ఞతా మహాసభ కరపత్రాన్ని విడుదల చేసిన మాదిగ సంఘాల ఐకాస నాయకులు. సెప్టెంబరు 22వ తేదీన హైదరాబాదు లోని రవీంద్ర భారతిలో నిర్వహించ తలపెట్టిన మాదిగల కృతజ్ఞత మహా సభను జయప్రదం చేయాలనీ సంకల్పంతో గండి శ్రీనివాస్ మాదిగ, జనగాం యాదగిరి మాదిగ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి మాదిగలు యొక్క చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ కల సాకారం అయింది. సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి 2024 తేదీన దేశంలోని ఆయా రాష్ట్రాలు ఎస్సీ, వర్గీకరణ చేసుకోవచ్చని ఒక తీర్పు ఇచ్చింది. తీర్పును గౌరవించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, వర్గీకరణ అమలు చేసినటువంటి ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాదిగల యొక్క చిరకాల ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సాహసోపేత నిర్ణయాన్ని అభినందిస్తూ కృతజ్ఞతా మహాసభను ఈ నెల 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఏం ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరెంటి విజయ్ మాదిగ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలు తమ యొక్క కృతజ్ఞత చాటడానికి అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంధమాల కమలాకర్, గండి సుఖేష్, జనగాం శ్రీనివాస్, బాశిపాక మల్లేశ్, చాడ కృష్ణ, చాడ రవి, చాడ మధు, చింత ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.