29-10-2025 12:00:00 AM
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
ఢిల్లీ, అక్టోబర్ 28: దేశ రాజధాని ఢిల్లీలో ని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ బస్సు విమా నం పక్కనే దగ్ధమైంది. ఈ ఘటన విమానాశ్రయంలోని మూడో టర్మినల్ వద్ద జరిగింది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ప్రమా దం సంభవించింది. అయితే బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివే శారు. అలాగే బస్సు సమీపంలో ఉన్న విమా నం దెబ్బతినలేదని, అందులోని ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమా దం సంభవించిందని తెలుస్తోంది. ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారులు ఇంకా స్పందించలేదు.