29-10-2025 12:00:00 AM
-ఫుల్బాగడిబడేశెట్టి రహదారి వెంబడి బాంబును అమర్చిన మావోయిస్టులు
-చర్ల సరిహద్దున సుక్మా జిల్లాలో ఘటన
చర్ల, అక్టోబర్ 28 (విజయక్రాంతి):చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు సుమారు 40 కిలోలు బరువు ఉన్న ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశాయి. ఫుల్బాగడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్బాగడి-బడేశెట్టి రహదారి వెం బడి మావోయిస్టులు అమర్చిన సుమారు 40కిలోల బరువున్న ఐఈడీ బాంబును భద్రతాదళాలు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే సురక్షితంగా నిర్వీర్యం చేశాయి. ఎటు వంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు. సంఘటన ప్రదేశం చుట్టూ భద్రతాదళాలు ముమ్మర సోదాలు నిర్వహించాయి. ఇందు కు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఐఈడీ బాంబు రికవరీ, నిర్మూల నలో జిల్లా పోలీసులు, 159 బీఎన్ సీఆర్‌పీఎఫ్ కీలక పాత్ర పోషించాయి.