మరమ్మతులు చేస్తుండగా కదిలిన బస్సు..
12-08-2026 12:59 AM
మెకానిక్ మృతి
కుత్బుల్లాపూర్, ఆగష్టు 11(విజయక్రాంతి): ఆర్టీసీ డిపోలో బస్సు కింద పని చేస్తున్న మెకానిక్ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో మెకానిక్ సంతోష్ కుమార్ (37) బస్సు కింద బ్రేక్ మరమ్మత్తులు చేస్తున్నాడు. బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనతో జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






