25 March, 2026 | 4:36 PM

సికింద్రాబాద్ నుండి ఖానాపూర్ కు బస్సు

25-03-2026 03:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఖానాపూర్- కడం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో జేబీఎస్ (సికింద్రాబాద్) నుండి నిర్మల్, ఖానాపూర్ కడెంకు బస్సు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరి తెలిపారు ప్రతిరోజు రాత్రి 22:20 కి సూపర్ లగ్జరి బస్సు సికింద్రాబాద్ నుండి బయలుదేరి ఖానాపూర్ కడెం చేరుకుంటుందన్నారు. ఖానాపూర్, కడం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినించుకోవాలని సూచించారు.

లోకేశ్వరం అబ్దుల్లాపూర్ సర్వీస్

నిర్మల్ నుండి లోకేశ్వరం మండల మీదుగా అబ్దుల్లాపూర్ వరకు బస్సు నడిపిస్తున్నట్టు నిర్మల్ పండరి తెలిపారు. గతంలో ఈ బస్సు నిజాంబాద్ జిల్లా నందిపేట్ వరకు వెళ్లేదని ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు దాన్ని అబ్దుల్లాపూర్ వరకు మన్నించడం జరిగిందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వించుకోవాలన్నారు