హుస్నాబాద్ – గట్ల మల్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలి
04-08-2026 03:43 PM
నంగునూరు,(విజయక్రాంతి): హుస్నాబాద్ నుంచి గట్లమల్యాల మీదుగా వయ నంగునూరు,సిద్దిపేట వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ మంగళవారం గట్లమల్యాల ప్రజాప్రతినిధులు హుస్నాబాద్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే బస్సును ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంగే నరేష్, ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్, వార్డు సభ్యులు లోకటి సతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు.






