వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన
04-08-2026 03:44 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మండలంలోని మంతటి గ్రామంలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (రావేప్) విద్యార్థులు మంగళవారం రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు, సంరక్షణ, సమగ్ర యాజమాన్య విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శైల రైతులకు గ్రామీణ వ్యవసాయం, శాస్త్రీయ సాగు పద్ధతులు, పంటల దిగుబడి పెంపు, పురుగులు–తెగుళ్ల నివారణపై పలు సూచనలు చేశారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.






