calender_icon.png 12 November, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'పుష్ప2' టికెట్ ధరలపై హైకోర్టులో విచారణ

03-12-2024 03:46:46 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): 'పుష్ప2' సినిమా టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్ కు రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరుపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకోచ్చారు. మొదటి 15 రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. భారీ బడ్జెట్ వల్ల టికెట్ ధరలు పెంచాల్సిన వచ్చిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వమే టికెట్ ధరలు పెంచడానికి అనుమతించింది కాదని జడ్జీ పిటిషనర్ ను ప్రశ్నించారు.

టికెట్ రెట్ల పెంపుల వల్ల అభిమనానులపై భారం పడుతుందన్న పిటిషనర్ న్యాయవాది పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఛారిటీలకు, ముఖ్యమంత్రి, సీఎం సహాయ నిధి ఖాతాలోకి వెళ్లట్లేదన్నారు. దీంతో థియేటర్లలో టికెట్ ధరల కంటే తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10 మంది కుటుంబ సభ్యులతో పోతే రూ.8 వేలు వస్తుంది కాదా అని జడ్జీ అడిగారు. దీనికి నిర్మాత తరపు న్యాయవాది స్పందిస్తూ  బెనిఫిట్ షో అభిమానుల సంఘాలకేనని, అందుకే రేట్లు పెంచినట్లు హైకోర్టు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

ఇక డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు బెనిఫిట్ షోతో పాటు, అర్థరాత్రి ఒంటి గంట షోకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రాత్రి 9.30 గంటల షో చూడాలంటే సింగిల్ స్క్రీన్, మల్టీ ఫ్లెక్స్ ఏదైనా ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అధనంగా రూ.800 పెంచింది. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్ రూ.1000 పైనే ఉండగా, మల్టీ ఫ్లెక్స్ రూ.1200 దాటుతోంది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ రూ.150, మల్టీ ఫ్లెక్స్ రూ.200, 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ రూ.105, మల్టీ ఫ్లెక్స్ రూ.150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ రూ.20, మల్టీ ఫ్లెక్స్ రూ.50 పెంచుతు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరహాలోనే ఏపీ ప్రభుత్వం స్వల్ప మార్పులతో టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది.