calender_icon.png 8 December, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు వ్యాపారుల బంద్..

08-12-2025 07:41:04 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా రోడ్డు విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ ఈనెల 9న వ్యాపారస్తులు పట్టణ బందుకు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వర్గాల వ్యాపారస్తులు బందుకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ అధికారుల నిరంకుశ విధానాలకు  వ్యతిరేకంగా వ్యాపారస్తులు ఈ  బంద్  కు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులను ఇబ్బందికి గురిచేస్తూ రోడ్డు వెడల్పు అంటూ చెత్తాచెదారాం, మట్టి కుప్పలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాపారస్తులు వాపోయారు. అభివృద్ధిని చూడకుండా రోడ్డు వెడల్పునే చూసుకుంటూ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, కలిసి విన్నవించుకున్నా మార్పు లేదని విమర్శించారు. మున్సిపల్ అధికారుల నిరంకుశ ధోరణికి నిరసనగా తల పెట్టిన పట్టణ బందుకు అన్ని రకాల వ్యాపారస్తులు బందులో పాల్గొని విజయవంతం చేయవలనీ కోరారు.