08-12-2025 07:38:06 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): స్థానిక బోయవాడ శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టులలో పాల్గొన్న విద్యార్థులందరికీ ముఖ్యఅతిథి ఎస్ఆర్ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి చేతులమీదుగా నాసా కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండేలా ప్రోత్సహించిన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా కోఆర్డినేటర్ ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ యొక్క కరీంనగర్ జోన్ లోనే 200 మంది పిల్లలు నాసా ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని, అన్ని జోన్లలో కూడా చాలా ఉత్సాహంగా నాసాలో పాల్గొంటున్నారని, ఇలాంటి విద్యార్థులకు శ్రీ చైతన్య యాజమాన్యం ఎప్పటికీ తోడు ఉంటుందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ న్యాలకొండ పద్మజా మాట్లాడతూ శాస్త్రీయపరంగా పిల్లలు వారి యొక్క మేధాశక్తిని ఉపయోగిస్తూ మరెన్నో ప్రాజెక్టులు చేస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఎం రాజు, డీన్ విజయకృష్ణ, నాసా ఇంచార్జ్ చంద్రకళ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.