22 April, 2026 | 5:28 PM

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేత

22-04-2026 04:20 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో బుధవారం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండల వేడిని ఉపాధి హామీ కూలీలు తట్టుకునేందుకు తమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను అందజేయడం జరుగుతుందన్నారు.

అలాగే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో బాటసారులకు, కూలీలకు నీడను ఏర్పాటు చేయడంతో పాటు చల్లని ద్రవపదార్ధాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడి శ్రీలత శ్రీను, ఉపసర్పంచ్ బెల్లి భవాని, గ్రామ కార్యదర్శి వలిగొండ పరమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నూనె శివ, వార్డు సభ్యులు సిరిపంగి లక్ష్మమ్మ, జాల శిరీష, జనార్ధన్, జాల సైదులు, అనంతరెడ్డి ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.