కాలనీ సమస్యలు పరిష్కరించండి
22-04-2026 04:24 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని 14వ వార్డు సోఫీ నగర్ కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. బుధవారం కాలనీకి చెందిన పలువురు నాయకులు స్థానిక వార్డులో సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ కు వినతిపత్రం అందించారు. వెంటనే అధికారులను అక్కడికి పంపి పనులు ప్రారంభించడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు






